భర్తను కిరాతకంగా హత్య చేసి.. నోట్లో యాసిడ్ పోసి హైదరాబాద్లో మహిళ దారుణం !
భర్తను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రికరించేందుకు ప్రయత్నించింది. హత్యోదంతానికి ఆమె తమ్ముడు శ్రీనివాస్ సహాయం కూడా తీసుకుంది. దీంతో ఇదే అదునుగా భావించిన సునీత ఎప్పటిలాగే భర్త తాగి ఇంటికి వచ్చాడు. అప్పటికే సునీత తమ్ముడు శ్రీనివాస్ కూడా ఇంట్లో ఉన్నాడు. భర్త నరసింహులు రాగానే అతని తలపై బలంగా కర్రతో శ్రీనివాస్ దాడి చేశాడు. దీంతో నర్సింహులుకు రక్తస్రావమైంది.
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. భర్తను అతికిరాతంగా అతడి భార్య హత్య చేసిన ఉదాంతం వెలుగు చూసింది. హత్యచేసి దానిని ఆత్మహత్యగా చిత్రికరించేందుకు ప్రయత్నించింది. ఈ నెల19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు చెప్పిన కథనం ప్రకారం... నగరంలోని రాయదుర్గానికి చెందిన నర్సింహులు(43) , సునీత(39) దంపతులు కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొద్దీ రోజులుగా నర్సింహులు జలసాలకు అలవాటుపడి ఇంటికి తాగొచ్చి సునీతను చిత్రహింసలు పెట్టేవాడు. రోజు భర్త పెట్టే టార్చ్ భరించస్తూ వస్తుంది సునీత. కాగా.. నర్సింహులు మారతాడని ఎదురుచూసింది కానీ అతను మారకపోక కుంటుంబ పోషనకు తెచ్చిన సంపాదన అంతా తాగుడికి ఖర్చు చేస్తున్నాడు.
ఎన్నో రోజులుగా భర్త వేధింపులు భరించిన సునీత సెప్టెంబర్ 19న భర్త నర్సింహులును చంపాలనే పథక రచన చేసింది. హత్యోదంతానికి ఆమె తమ్ముడు శ్రీనివాస్ సహాయం కూడా తీసుకుంది. దీంతో ఇదే అదునుగా భావించిన సునీత ఎప్పటిలాగే భర్త తాగి ఇంటికి వచ్చాడు. అప్పటికే సునీత తమ్ముడు శ్రీనివాస్ కూడా ఇంట్లో ఉన్నాడు. భర్త నరసింహులు రాగానే అతని తలపై బలంగా కర్రతో శ్రీనివాస్ దాడి చేశాడు. దీంతో నర్సింహులుకు రక్తస్రావమైంది. వెంటనే బావిలోని నీటీని తోడేందుకు బక్కెట్కు ఉపయోగించే తాడుతో భర్త మెడకు బిగించింది. కాగా.. ఇద్దరూ కలిసి నర్సింహులు చంపేశారు.
నర్సింహులు హత్యను ఆత్మహత్యగా చిత్రికరించేందుకు ప్లాన్ చేశారు. నర్సింహులు శవం నోట్లో యాసిడ్ పోశారు. అనంతరం అనుమానం రాకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్త నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడని, అతనికి ఉబ్బస వ్యాధీతో బాధపడుతున్నాడని, అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాని ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షలకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూడడంతో పోలీసులు సునీతను విచారించారు. దీంతో సునీత అసలు విషయం పోలీసులకు తెలిపింది. ముందు తలపై మొదీ తర్వాత నైలాన్ తాడును బిగించడం వల్లే మరణించాడని , తర్వాతే నర్సింహులను యాసిడ్ తాగించారని తేలింది. సునీత భర్త నర్సింహుల హత్యకు సహాకరించిన తమ్ముడు శ్రీనివాస్ కూడా పోలీసుల అరెస్టు చేశారు. దీంతో అక్కాతమ్ముడి కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు తెలిపారు.