ఒంటరి యువతులే అతని టార్గెట్.. ఒంటరిగా ప్రేమ జంట కనిపిస్తే ఇక అంతే. పొలీస్ అంటూ మాయమాటలు చెప్పి యువతులపై అత్యాచారం చేస్తాడు . ఇలా కొన్ని రోజులు అతను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సాగింది . చివరికి విషయం గుట్టు రట్టు అవడంతో ఇప్పుడు పోలిసుల చేతుల్లో కటకటాలు లేక్కబెడుతున్నాడు .
ఇక వివరాల్లోకి వెళ్తే గొల్ల శంకరయ్య అనే వ్యక్తి మెదక్ జిల్లాలోని కంది మండలం కలివేముల గ్రామంలో ఆర్ఎంపీ గా పనిచేస్తున్నాడు . మంచి వృత్తిలో ఉండి నీచమైన పనులకు అలవాటు పడ్డాడు . డాక్టర్ అని చెప్పుకుంటూనే ఒంటరిగా యువతులు మరియు ప్రేమ జంటలు కనిపిస్తే పోలీస్ అంటూ కొత్త అవతారం ఎత్తి వాళ్ళపై అత్యాచారం చేసేవాడు . ఇదే క్రమంలో గత నెల జూలై 26న ఓ యువతి తన స్నేహితుడితో కలిసి ఓడీఎఫ్ ఎస్టేట్‌కు వెళ్లే దారిలోని కందిగేటు దగ్గర ఉండగా గొల్ల శంకరయ్య గమనించాడు. పోలీస్‌నంటూ బెదిరించి.. మీకు ఇక్కడేం పని అని వారిని నిలదీశాడు.
అంతేకాకుండా అ యువతీ స్నేహితుడిని కొట్టాడు . ఇలా ఇద్దరినీ తన పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాను అంటూ బైక్ పై ఎక్కించుకున్నాడు . ఇలా నిజాంపూర్ శివారులో అ యువతీ పై అత్యాచారం చేసి చివరకు రాత్రి 9 గంటల సమయంలో వారిని సదాశివపేటలో వదిలిపెట్టాడు. అయితే దీనిపైన అ యువతీ పోలిస్ స్టేషన్ లో కంప్లేంట్ చేయగా పోలీసులు అతని కోసం పెద్ద వల వేసి పట్టుకున్నారు.. గతంలో కూడా గొల్ల శంకరయ్య ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడు . కానీ పరువుకోసం బయపడి ఎవరు కంప్లేంట్ చేయలేకపోయారు .