ప్రేమలో కాదు ... చావులో ఒక్కటైయ్యారు ఆదిలాబాద్ ప్రేమజంట కథ విషాదాంతం..
వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. బావామరదళ్ళ బంధం కూడా ఉండడంతో తమ పెళ్ళికి అడ్డంకులు ఉండవనుకున్నారు. జీవితం గురించి జంటగా ఎన్నో కలలు కన్నారు. అయితే, పెద్దలు చేసిన చిన్న పొరపాటుతో వారి ప్రేమ కథ దుఃఖాంతం అయింది. ప్రేమ సఫలం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఓడిపోయామని అపోహ పడి తమ నిండు ప్రాణాలను జంటగా తీసుకున్నారు.
అవును వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. మనస్సులు కలిశాయి. తమ ప్రేమను పెద్దలకు చెప్పి అందరి సాక్షిగా పెళ్లి చేసుకోవాలని నిర్ణియించుకున్నారు. పైగా వారు ఇద్దరూ బావ మరదల్లు కూడా. ఇంకేం వాళ్లు అనుకున్న విధంగానే తమ కుంటుంబంలోని పెద్దలకు తమ ప్రేమ విషయం చెప్పారు. ప్రేమికులను విడదీయడం ఇష్టం లేని ఆ కుటుంబ పెద్దలు కూడా వారి ప్రేమను అంగీకరించారు. ఆ జంటకు పెళ్లీ చేయాలని నిర్ణయించుకున్నారు. అంతాబానే ఉంది.. కానీ ఇంతలోనే ఆ ప్రేమ జంట పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అగ్నిసాక్షిగా ఏడు అడుగులు వేయాల్సిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అసలు ఏం జరిగింది? వారి ఆత్మహత్యకు వెనక కారణం ఏంటి? వివరాల్లోకి వెళితే...
ఆదిలాబాద్ జిల్లా అన్నారుపాడుకు గ్రామానికి చెందిన గుగులోత్ గోపి, ఆదే గ్రామానికి లావుడ్యా సింధు కొన్నెళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వరసకు బావ మరదళ్లు కూడా గోపి సోదరుడు( అన్నయ్య) కూడా సింధు అక్కను ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో వారు వరసకు బావ మరదళ్లు అయ్యారు. అలా గోపి, సింధు ఒకరికి ఒకరు పరిచమయ్యారు. ఇద్దరూ చనువు ఏర్పండి. అది కాస్త ప్రేమగా మారింది. ఇలా ఒకరి ఇష్టాలు ఒకరు పంచుకున్నారు. గోపి,సింధు కుటుంబాల్లో పెద్దలకు ఈ విషయం తెలియదు.
ఒక రోజు గోపి, సింధు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటారు అని భావించి ప్రేమ గురించి వారి కుంటుంబాల్లో చెప్పారు. పెద్దలు వారి ప్రేమకు ఒప్పుకోలేదు. ఒక చిన్న కారణం వారి ప్రేమకు అడ్డు వస్తుందని గోపి, సింధూ కూడా అనుకొని ఉండరు. వారు చెప్పిన కారణం చూసి గోపి, సింధు ఒక్కసారి ఇద్దరూ హతాశయులైయ్యారు. ఒకే కుటుంబం నుంచీ రెండో అమ్మయిని కోడలుగా తెచ్చుకోవడానికి ఇష్టం లేదని గోపి కుటుంబ సభ్యులు నిరాకరించారు. వారి ప్రేమకు గోపి అన్నావదినలే పెళ్లి అడ్డువస్తుందని అనుకోలేదు.
అయితే ఇదే విషయమై గోపి ఇంట్లో కొన్ని రోజులుగా చర్చించారు. వారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు . చివరికి గోపి ప్రయత్నం ఫలించింది. కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. పిల్లల ఇష్టం మేరకు రెండు కుటుంబాలు ఒక అంగీకారనికి వచ్చాయి. ఈ విషయం గోపితో చెప్పాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆరోజు(శనివారం) బయటకు వెళ్లిన గోపి, సింధు ఇంకా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమైంది. అనుకోకుండా గోపి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తమ ప్రేమకు మీరు ఒప్పుకోవడం లేదు మేము ఇద్దరం పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాం అని చెప్పాడు. కానీ కుటుంబ సభ్యలు ఎంత చెప్పిన వారు వినలేదు.
ఎంత గాలించిన వారి ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు వారి చేరుకునేలోగా వారి తిరిగి రాని లోకాలకు వెళ‌్లిపోయారు. ప్రేమలోను ఒక్కటైనా ఆ జంట చావులోను ఒక్కటైంది. పెద్దలు తమ పెళ్లి జరిపిస్తారో లేదోనన్న అనుమానంతో ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనపై ఘటనపై కేసు నమోదు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ పెళ్లికి ఒప్పుకుంటారో ఒప్పుకోరో అన్న కారణంతోనే ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పంచనామ అనంతరం వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.