స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రతి ఒక్కరు టిక్ టాక్ వాడేస్తున్నారు . కానీ ఇది ఎన్నో అనర్ధాలకు దారి తీస్తుంది . తాజాగా ఓ యువకుడి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు . ఎస్ ఆర్ నగర్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కర్నూల్ లోని ఓ అమ్మాయికి ఎర్రగడ్డలోని నేతాజీ నగర్ కి చెందినా సాయికి టిక్ టాక్ లో పరిచయం ఏర్పడింది . ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది . ఈ తరుణంలో వీరిద్దరూ పలుమార్లు కలుసుకున్నారు .అయితే సాయి తన అవసరాల నిమిత్తం యువతీ దగ్గర నగలు, నగదు తీసుకున్నాడు . ఇలా కొన్నిరోజులకు అవన్నీ ఇవ్వమని అ యువతీ కోరింది .దీనికి సాయి నిరాకరించాడు . అయితే అ యువతీ విషయాన్ని ఇంట్లో చెప్పేయడంతో కర్నూల్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు . విచారణ నిమిత్తం పోలీసులు సాయికి కాల్ చేయగా భయాందోళనలకి గురైన సాయి సూసైడ్ కి పాల్పడ్డాడు ...