పాపం పండక మానదు!

Update: 2019-05-17 14:49 GMT

భారత దేశం నుంచి పొట్ట చేత్తో పట్టుకుని విదేశాలకు వెళతారు. అక్కడకు వెళ్ళాక చేయకూడని తప్పు చేస్తారు. దీంతో కుటుంబం పరువు తోపాటు దేశం పరువూ తీస్తారు. ఎపుడో పద్నాలుగేళ్లు క్రితం జరిగిన సంఘటన ఇది. కాదు దారుణం ఇది. కరీంనగర్ కు చెందిన సీతారాం సల్వాజి న్యూజిలాండ్‌ లోని ఆక్లాండ్‌లో మౌంట్‌ఎడెన్‌ జైలు కరెక్షన్‌ శాఖలో ఉద్యోగం సంపాదించారు. అక్కడ ఉండగా ఒళ్లు తిమ్మిరెక్కి ఓ పదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ బాలిక పాపం ఎవరికీ చెప్పలేక కుమిలిపోతూ జీవించింది. సీతారాం తన పని తానూ చేసుకుంటూ దర్జాగా కాలరెగరేసుకుని తిరిగేస్తున్నాడక్కడ. బాధితురాలైన పాప యుక్త్వా వయస్కురాలైంది. అప్పటి సంఘటనను మరచిపోలేక, ఎవరితోనూ చెప్పుకోలేక కుంగి పోతోంది. ఆమె పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు పలువిదాలుగా ప్రశ్నించారు. చివరికి విషయం వారికి చెప్పింది. ఇంకేముంది.. మన సీతారాం పాపం పండింది. పోలీసులు కేసు నమోదు చేసి అయ్యగారిని అరెస్టు చేశారు. కేసు అక్కడి కోర్టులో రెండేళ్లు నడిచింది. సాక్ష్యాలన్నీ సీతారాం దోషిగా తేల్చాయి. దాంతో కోర్టు అతనికి 14 సంవత్సరాల జైలు శిక్షని విధించిందిపుడు. అందుకే అంటారు పెద్దలు చేసిన పాపం ఎపుడో ఒకపుడు పండి తీరుతుందని.  

Similar News