కుక్క తెచ్చిన తంటాతో ఆడోల్లు, మొగోళ్ళు తేడా లేకుండా కొట్టుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాటుకురి సందీప్‌కు చెందిన పెంపుడు కుక్క.. పక్కింటి పరిసరాల్లో కొద్దిరోజులుగా మలమూత్ర విసర్జన చేస్తోంది. దీంతో ఆ ఇంటి యజమాని పలుమార్లు వారిని మందలించాడు. అయినా ఆ కుక్క వారి ఇంటిముందే మలమూత్ర విసర్జన చేస్తుండటంతో అతనికి కోసం కట్టలు తెంచుకుంది. దీంతో సందీప్ కు చివాట్లు పెట్టాడు. దాంతో సందీప్ ఆగ్రహంతో ఊగిపోయాడు. దీంతో ఓ మహిళపై దాడికి తెగబడ్డాడు. ఇరుకుటుంబాలు పిడి గుద్దుల వర్షం కురిపించుకున్నాయి. బాధితులు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.