కేంద్రంలోని బీజేపీ సర్కారుకు అల్టిమేటమిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. ఏప్రిల్ 6వ తేదీలోగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు వాళ్ల మొహానపడేసి వచ్చేస్తారని ప్రకటించారు. నెల్లూరుజిల్లా కలిగిరి బహిరంగసభలో జగన్ ఈ సంచలన ప్రకటన చేశారు. చెడిపోయిన రాజకీయాల్లో విశ్వసనీయత తీసుకువస్తామని మార్చి 5నుంచి పార్లమెంట్ లో తమ పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తారని.. ఏప్రిల్ 6వ తేదీ వరకూ తమ నిరసన కొనసాగిస్తారని ఒక వేళ కేంద్రం దిగిరాకపోతే, అదే రోజున తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని జగన్ అన్నారు.