వైఎస్ జగన్ తన పాదయాత్రకు విరామం తీసుకున్నారు. మంగళవారం వైసీపీ ఎన్డీఏపై పెట్టనున్న అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్న సందర్భంగా జగన్ తన పార్టీ ఎంపీలతో దిశానిర్ధేశం చేయనున్నాను. ఈ సందర్భాంగా జగన్ తన పాదయాత్రకు విరామం తీసుకున్నారు. అయితే ఆదివారం గుంటూరుజిల్లా నరసరావుపేటలో జగన్ పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో జగన్ టీడీపీ నేతల్ని, మంత్రుల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన చిలకలూరిపేటలో మంత్రి పత్తిపాటి పుల్లారావును విమర్శలు చేస్తే ..నరసరావు పేటలో కోడెల శివప్రసాదరావును టార్గెట్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు.
పాదయాత్రలో జగన్ ప్రసంగం ఆసాంతం కోడెల ప్రసాద్ రావు చుట్టూ తిరిగినా ఆయన పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక్కడి వ్యాపారులు కేంద్రం విధించిన జీఎస్టీతో బాధపడుతుంటే ..టీఎస్టీ, కేఎస్టీ ట్యాక్సులతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీఎస్టీ అంటే తెలుగు దేశం సర్వీస్ ట్యాక్స్ అని దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రతీ ప్రాజెక్ట్ లో అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దోచుకుంటున్నా..తమ హయాంలో అవినీతే లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
అదే సమయంలో కేఎస్టీ అంటే ఏంటో జగన్ చెప్పలేదు. నరసరావు పేట నియోజకవర్గంలో కేఎస్టీ ని కూడా ప్రజలు చెల్లించాల్సి వస్తుందన్న జగన్, రైల్వే కాంట్రాక్టుల దగ్గర నుంచి విద్యుత్తు ప్రాజెక్టుల వరకూ, కోటప్పకొండ కాంట్రాక్ట్ నుంచి మద్యం కాంట్రాక్టుల వరకూ, చివరకు కొత్త సినిమా రిలీజయినా కేఎస్టీ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. టీఎస్టీ, కేఎస్టీల పేరుతో ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. నరసరావుపే నియోజకవర్గంలో ఇప్పటికీ పెత్తనం ఎవరదేనిది అక్కడ ప్రజలకు తెలిసి ఉండటంతో జగన్ కేఎస్టీకి అర్థం చెప్పకుండానే తన ప్రసంగాన్ని ముగించేశారు. కాని కేఎస్టీ అంటే అక్కడి ప్రజలకు అర్థమై నవ్వుకోవడం కన్పించింది.
ఇదిలా ఉంటే గతంలో కోడెల శివప్రసాద్ రావుకు నరసరావుపేటలో మంచి పట్టున్న ప్రాంతం. కానీ తనకొడుకు కోడెల శివరామకృష్ణ వ్యాపారస్థుల్ని బెదిరించి అక్రమవసూళ్లకు పాల్పడుతున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాంట్రాక్ట్ లు కూడా శివరామకృష్ణకు వచ్చేలా ప్రభుత్వ మంత్రాంగం ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. అయితే వచ్చే ఎన్నికల కోసం తన కొడుకును ఎమ్మెల్యే బరిలో దించేందుకు స్పీకర్ కోడెల అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఆ మంతనాల్లో చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లు, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడడం ఖాయమని కోడెల అభిమానులు చెప్పుకుంటున్నారు.