అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో డైరక్టర్ ఆర్జీవి తెరకెక్కించిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ). అయితే ఈ స్టోరీ తనదేనంటూ సర్కార్ -3 రచయిత పి. జయకుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ రచయిత మ్యూజిక్ డైరక్టర్ ఎం.ఎం . కీరవాణిపై నిప్పులు చెరిగారు. ఎన్నో అద్భుతమైన భక్తిరస చిత్రాలకు మ్యూజిక్ ను అందించిన కీరవాణి పోర్న్ స్టార్ మియా మాల్కోవా మార్మాంగంపై ఓంకారం ప్లే చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు పరమపవిత్రంగా భావించే శివుడ్ని అపవిత్రం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. . శివాలయానికి వెళ్లినప్పుడు మియామాల్కోవా గుర్తుకు వస్తే ఎంత దారుణంగా ఉంటుందో తలుచుకుంటే బాధేస్తుందని చెప్పుకొచ్చాడు. ఓపెనింగ్ షాట్‌లోనే ఓంకారం జీఎస్టీ ఓపెనింగ్ షాట్‌లోనే ఓంకారం వినిపిస్తుంది. అది ఓంకారం కాదు అని అబద్దాలు అడే అవకాశం ఉంది. కచ్చితంగా అది ఓంకారమే అనేది స్పష్టం. జీఎస్టీకి కీరవాణి ఎక్కడ మ్యూజిక్ కొట్టారని అనేది చాలా ముఖ్యం. కళాత్మక సినిమా అని సెక్స్ మూవీని తీసి ఓ కళాత్మక చిత్రం అని చెప్పుకోవడం ఇంకా దారుణమే.
పైపెచ్చు నా మ్యూజిక్‌ను వర్మ ఎలివేట్ చేయడం కీరవాణి చెప్పుకోవడం దారుణం అని అన్నారు.
సెక్స్ సినిమా ను తీసి ఓ కళాత్మక చిత్రం అంటూ పొగడ్తల్ని కురిపించడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి వారిని అలాగే వదిలేస్తే వియాకు మాల్కోవాకు గుడికడతారని ఎద్దేవా చేశారు.
నా స్టోరీని కాపీకొట్టినందుకు కాదె. హిందూ సాంప్రదయాల్ని మంటగొలిపిన కీరవాణి ఎక్కడ మ్యూజిక్ కొట్టాడో.. జీఎస్టీ సినిమాను యూరప్‌లో తీశానని వర్మ చెబుతున్నారు. అలాంటి సినిమాకు కీరవాణి ఎక్కడ మ్యూజిక్ కొట్టాడు? కొడితే తన ఇంట్లో నాలుగు గోడల మధ్య కొట్టాడా? లేక ప్రొడక్షన్ హౌస్‌లో కొట్టాడా అనే విషయంపై కీరవాణి క్లారిటీ ఇవ్వాలి అని జయకుమార్ డిమాండ్ చేశారు. మొత్తానికి జీఎస్టీ వివాదం ఇండస్ట్రీలో రోజుకో మలుపు తిరుగుతుంది.