ఇండోనేషియాపై మరోసారి సునామీ రక్కసి విరుచుకుపడింది. నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని బీచ్‌ల్లో అలలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. వీటి ధాటికి దాదాపు 40 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అలాగే 600 మందికి పైగా గాయాలయ్యాయి. పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించినట్లు జాతీయ విపత్తు సంస్థ అధికారులు వెల్లడించారు. క్రకటోవా అగ్నిపర్వతం విస్పోటనం కారణంగా సునామి సంభవించినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సునామి ప్రభావిత ప్రాంతాలను గుర్తించి భద్రతా బలగాల సాయంతో ప్రజలను స్రురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.