కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాతి పండక్కి ఊరెళ్లాలంటే ట్రైయిన్ ప్రయాణం చేయాలి. అసలే పండగ కదా సీట్లు దొరకడం కష్టం. అందుకే మీరు ముందుగా వెళ్లి రైల్లో ఓ భోగిలో సీట్లు రిజర్వ్ చేశారు. కానీ అనుకోకుండా ట్రైన్ బయలు దేరుతుంది. మీరైతే ఏం చేస్తారు. ట్రైన్ దిగి మరో ట్రైన్ కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఆ మహిళ మాత్రం అలా కాదు. భర్త రాలేదని ట్రైన్ బుల్లెట్ ట్రైన్ ఇంచు కూడా కదలకుండా ఆపేసింది. ఇదేం చోద్యం అని ప్రశ్నిస్తే నా భర్త రావడం ఆలస్యం అవుతుంది. అందుకే ట్రైన్ ఆపేశానని తీరిగ్గా చెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన రైల్వే అధికారులు ఆమెను ట్రైన్ నుంచి భయటకు తోసేశారు. రైల్వే స్టేషన్ లో ఆమె చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఎట్ ప్రజెంట్ ఆ మహిళ చేసిన హంగామా నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయ్యండి.
లూ హైలీ చైనాలోని అనుహుయి ప్రాంతంలో స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. అయితే ఆమె మరో ప్రాంతానికి వెళ్లేందుకు తన కూతురు తో కలిసి బుల్లెట్ ట్రైన్ ఎక్కి భర్త కోసం ఎదురు చూస్తుంది. అయితే ఆమె ట్రైన్ ఎక్కిన కొద్దిసేపటికి బయలు దేరింది. భర్తరాలేదు. ఒకటే టెన్షన్ ఏం చేస్తుంది. ట్రైన్ కదలకుండా ఆటోమెటిక్ డోర్లకు అడ్డంగా నిలబడింది (హైస్పీడ్ రైళ్లు డోర్లు మూసిన తర్వాతే కదులుతాయి). దీంతో బుల్లెట్ రైలు ఆగిపోయింది. ఏం జరిగిందోనని కంగారు పడ్డ రైల్వే పోలీసులు తనిఖీలు ప్రారంబించారు. అప్పుడే రైలు డోర్ల వద్ద నిలబడిన ఆమెను లోపలికి వెళ్లాలని పోలీసులు కోరారు. అయినా వినిపించుకోకుండా అలాగే నిలబడింది. తన భర్తరాలేదని అందుకే ట్రైన్ ఆపేశానని..కొద్దిసేపట్లో తన భర్త వస్తాడని వాదించింది. దీంతో విసుగుపోయిన రైల్వే సిబ్బంది ఆమెను ప్లాట్ ఫాం మీదకు తోసేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.