నేటి జనరేషన్ లో పెళ్లికి ముందే డేటింగ్ లు , చాటింగ్ లు , మీటింగ్ లు అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతవరకు బాగున్నా ఆ డేటింగ్ చేసే వాళ్లు పెళ్లి చేసుకుంటారా అంటే . నచ్చితే చేసుకుంటారు. లేదంటే పెళ్లి చేసుకోరు. ఇక హీరోలు, హీరోయిన్లు కూడా ఈ తరహాలో ఉండడంతో ర్యాపిడ్ ఫైర్ కాన్సెప్ట్ తో కొన్ని ఇంటర్వ్యూల్లో ‘వర్జినిటీ', ‘ఫస్ట్ లవ్', ‘ఫస్ట్ కిస్ ఇలా అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు . ‘మీరు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు?' అంటూ మొహం మీదే అడిగేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలు పోని సదరు వ్యక్తులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇక మనసుకు నచ్చింది సినిమాతో టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆమైరా దస్తూర్ కూడా ఇలాంటి ప్రశ్న ఒకటి ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సందర్భంగా ఆమె ఎదురు సమాధానం ఇవ్వడం హాట్ టాజిక్ అయింది.
‘మీరు మీ వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు?' అనే ప్రశ్నకు అమైరా దస్తూర్ స్పందిస్తూ...... ‘నేను వర్జినిటీ కోల్పోయాను అని మీకు ఎవరు చెప్పారు?' అంటూ అమైరా మండి పడ్డారు.
వర్జినిటీ కోల్పోవడం లాంటిది జరిగితే అది కేవలం పెళ్లి తర్వాతే.... పెళ్లికి ముందు హద్దులు దాటి సెక్సులో పాల్గొనడం లాంటివి తనకు ఇష్టం ఉండదు అని ఈ సందర్భంగా అమైరా దస్తూర్ తేల్చి చెప్పారు.
అమైరా దస్తూర్ లేటెస్టుగా రిలీజైన ‘మనసుకు నచ్చింది' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. మంజుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె నిత్య అనే పాత్రలో నటించారు. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి .
అమైరా దస్తూ ఇప్పటి వరకు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ చిత్రాల్లో నటించినా ఏ సినిమా కూడా కలిసి రాలేదు. ఆమె నటించిన ఇసాఖ్, మిస్టర్ ఎక్స్, అనేగన్, కుంగ్ ఫూ యోగాతో పాటు తాజాగా విడుదలైన ‘మనసుకు నచ్చింది' చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది.