కష్టమర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్ మార్పులు చేర్పులు చేస్తూ వస్తుంది. కొద్దిరోజుల క్రితం వాట్సాప్ అడ్మిన్ లో మార్పులు చేసింది. ఇప్పుడు వాట్సాప్ నెంబర్లను ఎలాంటి గందరగోళం లేకుండా బదిలీ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులో తెచ్చింది.
సాధారణంగా వాట్సాప్ గ్రూప్ లో ఉన్న అడ్మిన్ ను తొలగించాలంటే వారు సంబంధిత గ్రూప్ ను బయటకు రావాల్సి ఉంది. అయితే త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్ తో ఆ సమస్య ఉండదని అంటున్నారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, ఐవోఎస్ లో ఈ ఫీచర్ పరీక్ష దశలో ఉన్నట్లు సమాచారం. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే అడ్మిన్ ను తొలగించేందుకు వీలుగా ‘డిస్మిస్’ బటన్‌ను వాట్సాప్ కొత్తగా తీసుకురాబోతోంది.
వీటితో పాటు గ్రూప్ లో వీడియోలు, మెసేజ్, షేరింగ్ వాయిస్ మెసేజ్ లను కట్టడి చేసే అవకాశం ఒక్క అడ్మిన్ కు ఉంది. త్వరలో రానున్న కొత్త ఫీచర్ కు అడ్మిన్ తో పాటు గ్రూప్ లో ఉన్నవారు ఎవరైనా పై వాటిని నియంత్రిచవచ్చు. ఈ సదుపాయాన్నియాడ్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఎవరైనా సభ్యడు ఇవి చేయాలంటే అడ్మిన్ అనుమతి తప్పనిసరి.
వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను శుక్రవారం లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ వాట్సాప్ నెంబర్లను తేలికగా మార్చుకోవచ్చు. అంతేకాక ఎలాంటి గందరగోళం లేకుండా కొత్త నెంబర్‌కు డేటాను కూడా బదిలీ చేసుకోవచ్చు. కొత్త ‘ఛేంజ్ నెంబర్' ఫీచర్ అప్‌డేట్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లోని 2.18.97 ఆండ్రాయిడ్ బీటా అప్‌డేట్‌కు అందుబాటులో ఉంది. కొత్త ‘ఛేంజ్ నెంబర్' ఫీచర్‌తో ఓల్డ్ ఛేంజ్ నెంబర్ ఫీచర్‌కు మరిన్ని మెరుగులను అందించిందని డబ్ల్యూఏబీటాఇన్ఫో ట్వీట్ చేసింది.