దేశియ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో మరో యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో మిగిలిన టెలికాం దిగ్గజాలు వణికిపోతున్నాయి. మార్చి 31తో జియో ప్రైమ్ గడువు ముగియనుండగా... మరో ఏడాది పాటు ఉచితంగా సేవల్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. జియో ప్రైమ్ లో ఉన్న ఆఫర్లని మరో సంవత్సరం పాటు ఉచితంగా పొందవచ్చని తెలిపింది. కొత్తగా జియో నెట్ వర్క్ కు మారే వాళ్లు రూ.99తో మెంబర్ షిప్ తీసుకోవాలని సూచించింది. 'కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్' పట్ల ఆసక్తి చూపితే చాలు.. రానున్న ఏడాదిపాటు జియో ప్రైమ్ ద్వారా ఇప్పుడు పొందుతున్న సదుపాయాలను ఉచితంగా పొందొచ్చు. కొత్తగా చేరుతున్నవారు రూ.99 చెల్లిస్తే ఏడాదిపాటు ప్రైమ్ సేవల్ని పొందడం వీలవుతుంది.
జియో ప్రైమ్ తో పాటు , జియో జ్యూస్ అనే యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ వల్ల బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. ఆప్టమైజేషన్ చేసుకోవచ్చని జియో ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతానికి బీటా వర్షన్ లో ఉన్న ఈయాప్ ఏప్రిల్ ఫస్ట నుండి అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు జియో జ్యూస్ యాప్ తో పాటు జియో జ్యూస్ పవర్ బ్యాంక్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నట్లు సమాచారం. దీని ధర కూడా రూ. 500 లోపే ఉంటుందని అంచనా
ఇక ప్రైమ్ మెంబర్‌షిప్ పొందడం వల్ల జియోకు చెందిన ఎన్నో పెయిడ్ యాప్స్‌ను ప్రైమ్ మెంబర్లు ఉచితంగా వాడుకోవచ్చు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అనేక జియో యాప్స్ ప్రైమ్ కస్టమర్లకు లభిస్తున్నాయి కూడా. అయితే ఆ యాప్స్ జాబితాలోకి మరో కొత్త యాప్ వచ్చి చేరనుంది.