ఇక ఆగలేను

Update: 2018-02-15 08:04 GMT

అనుష్క శర్మ నటించిన ‘పారి’ సినిమా టీజర్ తాజాగా విడుదల అయింది.. ఈ టీజర్ లో అనుష్క శర్మ అతి భయానకంగా కనిపిస్తూ భయపెడుతుంది.. మోస్ట్ థ్రిల్లర్ నేపథ్యంలో చిత్రించిన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.. ఈ టీజర్ మీద అభిమానుల ప్రశంశల జల్లులు వెల్లువెత్తుతున్నాయి..తన భార్య అనుష్క శర్మ నటించిన 'పారి' సినిమాను వెంటనే చూసేయాలని ఉందని... ఆగలేకపోతున్నానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ మేరకు అతను ట్విట్టర్ ద్వారా స్పందించాడు. 'నా జీవితంలో అత్యంత ప్రీతిపాత్రమైన అనుష్క నటించిన సినిమాను చూడటానికి ఆగలేకపోతున్నా. ఇంతకు ముందు ఏ సినిమాలో కనిపించనంత గొప్పగా ఈ సినిమాలో అనుష్క ఉంది. ఇప్పటికే నేను ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్నా' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో పాటు 'పారి' మూవీ ట్రైలర్ ను అప్ లోడ్ చేశాడు.

Similar News