ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్థశతకం (60 నాటౌట్) సాధించి జట్టును గట్టెక్కించాడు. ఆట ఆరంభంలోనే కొద్దిగా వెనకబడిన టీమిండియా అప్పటికే రెండు వికెట్ల కోల్పోయింది. పుజారా ఔటై రహానే మైదానంలోకి ఆడుగుపెట్టి చెలరేగుతుండటంతో అవతలి ఎండ్‌లో ఉన్న కోహ్లీ కూడా వేగం పెంచాడు. ఇదే జోష్‌లో కమిన్స్ వేసిన 44వ ఓవర్లో ఫోర్ బాదిన విరాట్ టెస్టు కెరీర్‌లో 20వ హాఫ్‌సెంచరీ నమోదు చేశాడు. దీంతో భారత్ ప్రస్తుతం 56 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.