గవాస్కర్ రికార్డును అధిగమించిన కొహ్లీ

Update: 2017-12-13 06:10 GMT

కోల్ కతా టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తన బ్యాట్ కు పూర్తిస్థాయిలో పని చెప్పాడు. బ్యాటింగ్ కు అంతగా అనువుకాని ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై...ఫైటింగ్ సెంచరీతో చెలరేగాడు. శ్రీలంక ముందు..231 పరుగుల విజయలక్ష్యం ఉంచడంలో ప్రధానపాత్ర వహించాడు.   అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీల మైలురాయిని చేరాడు.....

కాగా శ్రీలంకతో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన తొలిటెస్ట్ తొలిఇన్నింగ్స్ లో...డకౌట్ గా వెనుదిరిగిన కొహ్లీ....రెండో ఇన్నింగ్స్ లో మాత్రం.. అజేయ సెంచరీతో నిలిచాడు. తన కెరియర్ లో 60వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కొహ్లీ... రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తన ట్రేడ్ మార్క్ షాట్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫాస్ట్ బౌలర్ల అడ్డాగా మారిన ఈడెన్ గార్డెన్స్ పిచ్ పైన...ఓ వైపు శ్రీలంక పేసర్లు చెలరేగిపోతుంటే. మరోవైపు కొహ్లీ దీటైన బ్యాటింగ్ తో తన పోరాటం కొనసాగించాడు.

టీమిండియా కెప్టెన్ గా 10 సెంచరీలు సాధించిన సునీల్ గవాస్కర్ రికార్డును కొహ్లీ...11వ సెంచరీతో తెరమరుగు చేశాడు. కొహ్లీ మొత్తం 18 టెస్ట్ శతకాలలో కెప్టెన్ గా 11, బ్యాట్స్ మన్ గా ఏడు సెంచరీలు నమోదు చేశాడు.
 

Similar News