విరాట్ కళ కళ...బెంగళూరు వెల వెల

Update: 2018-04-18 11:46 GMT

ఐపీఎల్ 11వ సీజన్ మొదటి 14 మ్యాచ్ లు ముగిసే సమయానికి...బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కొహ్లీ అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ముంబై వాంఖెడీ స్టేడియం
వేదికగా ముంబై ఇండియన్స్ తో ముగిసిన మ్యాచ్ లో తన జట్టు చిత్తుగా ఓడినా కొహ్లీ మాత్రం 62 బాల్స్ లో 92 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు. కొహ్లీ మొత్తం ఏడు బౌండ్రీలు, నాలుగు సిక్సర్లతో 148కి పైగా స్ట్రయిక్ రేట్ సాధించిన ప్రయోజనం లేకపోయింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా పేరుతో ఉన్న 4వేల 558 పరుగుల ఐపీఎల్ అత్యధిక పరుగుల రికార్డును కొహ్లీ తెరమరుగు చేశాడు. విరాట్ కొహ్లీ మొత్తం 153 ఇన్నింగ్స్ లో 4వేల 619 పరుగులు సాధించాడు. ఒకే ఫ్రాంచైజీ తరపున అత్యధిక పరుగులు సాధించిన తొలి ఆటగాడు విరాట్ కొహ్లీ మాత్రమే. గత 10 సీజన్లలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కు కొహ్లీ కెప్టెన్ గా ఒక్క టైటిలూ అందించ లేకపోడం కూడా ఓ రికార్డుగా మిగిలిపోతుంది.
 

Similar News