హాలీవుడ్, బాలీవుడ్ లో మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. హాలీవుడ్ లో పాపులర్ నిర్మాత వైన్ స్టీన్ హీరోయిన్లను తన కోరిక తీర్చమంటూ పలుమార్లు బలవంతం చేశాడని హీరోయిన్ నటాసియా మీడియాముందు పూసగుచ్చినట్లు చెప్పింది. 2008లో ఓ కథ వినిపిస్తానని హోటల్ కి రమ్మనమని చెప్పిన తనను.. డ్రగ్స్ తీసుకున్నట్లు ఉన్న వైన్ స్టీన్ కృర మృగంలా తనపై అత్యాచారం చేస్తూ రాక్షసానందాన్ని పొందాడని ..ఆ సమయంలో తాను చచ్చినట్లు పడిపోయానని వెల్లడించింది. ఇలా వేదింపుల జాబితాలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కాకుండా..సామాన్య మహిళలు కూడా ఉన్నారు. అయితే అలాంటి వారికి బుద్ధి చెప్పేలా కొంతమంది మహిళలు మీటూ అనే హ్యాష్ ట్యాగ్ తో తమకు జరిగిన లైంగిక వేదింపుల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
బాలీవుడ్ కు చెందిన యాక్టర్ జితేంద్ర తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనకు మామ అయిన జితేంద్ర ఓ సినిమా షూటింగ్ చూద్దామని హిమాచల్ ప్రదేశ్ కు తీసుకెళ్లి తనని అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడం కలకలం రేపుతుంది. 1971లో తనకు 18ఏళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి సినిమా షూటింగ్ చూద్దామని హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లినపుడు ఆయన తనపై అఘాయిత్యం చేశాడని సాక్షాత్తూ ఆయన మేనకోడలు ఆరోపించింది. ఇన్ని సంవత్సరాల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఓ బలమైన కారణం ఉందని తెలిపింది. జితేంద్రకు రాజకీయపలుకు బడి ఉందని ..దాంతో తాను భయపడి ఏం చేయలేకపోయానని కన్నీటి పర్యంతమైంది. ఇప్పుడు తన తల్లిదండ్రులు కన్నుమూశారని, ప్రజాసంఘాల హామీతో జితేంద్రపై ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది. 1971వ సంవత్సరంలో తాను 18 ఏళ్ల వయసులో ఉండగా జరిగిన అత్యాచార ఘటన గురించి బాధిత మహిళ ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సంచలనం రేపింది.