వండలూర్‌ శ్రీలక్ష్మి కుబేరుడు

Update: 2017-09-16 12:44 GMT

చెన్నై నగరంలో వండలూర్‌ సమీపంలోని రత్నమంగళం అనే గ్రామంలో నిర్మితౖమెన శ్రీలక్ష్మీ కుబేరుడి గుడి ఎంతో ప్రసిద్ధమై నది. ఈ గుడిని దర్శించుకుంటే లక్ష్మీకటాక్షం లభిస్తుందని ప్రతీతి. సంపదలకు దేవత శ్రీ మహాలక్ష్మి, కుబేరుడు వాటికి నిర్వాహకుడు. కుబేర పూజ అనేది స్థిరౖమెన సంపదలతో తులతూగడానికి ఈ ఇద్దరికీ చేసే పూజ. 


ఈ పూజ వలన సిరిసంపదలు చేకూరడమే కాకుండా పోగొట్టుకున్న పాత సంపద కూడా త్వరగా తిరిగి వస్తుందని నమ్మకం. ఈ పుణ్యక్షేత్రంలో కుబేరుడు ఎడమచేతిలో సంగనిధి కుండ, కుడిచేతిలో పద్మనిధి కుండతో తల్లి శ్రీ మహాలక్ష్మి మరియు సతి చిత్తరిణి (చిత్రలేఖ) సమేతంగా విలసిల్లుతున్నాడు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి తన పెళ్లి కోసం కుబేరుడి వద్ద అప్పు తీసుకుని ఇంకా వడ్డీ చెల్లిస్తూనే ఉన్నారు. కనుక తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునే ముందు ఈ గుడిని సందర్శిస్తే మరిన్ని సత్ఫలితాలు ఉంటాయని భక్తుల విశ్వాసం.

అమ్మవారిని పూజిస్తే.. ఆశించిన ఫలితం 
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు నారాయణవనానికి వెళ్తుంటారు. శ్రీనివాసుడు.. పద్మావతీదేవిని చూసిందీ.. వారి వివాహం జరిగింది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రం స్వామివారి కల్యాణ ఘట్టాలకు నిలయంగా కనిపిస్తూ వుంటుంది. అందుకే ఇక్కడ శ్రీనివాసుడు కల్యాణ వేంకటేశ్వరు డుగా పద్మావతీదేవి సమేతంగా దర్శనమిస్తుంటాడు. గర్భాలయంలో స్వామివారు కొలువై వుండగా, ప్రత్యేక ఆలయంలో అమ్మవారు కొలువై అనుగ్రహిస్తూ వుంటుంది. అడుగడుగునా అనేక విశేషాలను.. మహిమలను ఆవిష్కరించే ఈ క్షేత్రంలో అడుగుపెట్టడమే భక్తులు అదృష్టంగా భావిస్తుంటారు. ఈ ఆలయంలో గల అమ్మవారిని పూజించిన వారికి ఆశించిన ఫలితం దక్కుతుందని పురోహితులు అంటున్నారు. వివాహ దోషాలు తొలగిపోతాయి. సర్పదోషాలుండవు అని వారు సూచిస్తున్నారు. 

ఇంతేకాకుండా ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఈతిబాధలు ఏమాత్రం ఉండబోవు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రతిరోజు 2 నుంచి 3 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది. అంటే నెలకు 75 నుంచి 90 కోట్లు, సంవత్సరానికి వెయ్యికోట్లకు పైమాటే. ఇంతటి ఆస్తిని కాపాడడ మంటే అది చిన్న విషయం కాదు.  వారే మహద్వా రం ఎదురుగా ఉన్న శంఖనిధి - పద్మనిధిలు. ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమేనండి.. మహద్వారానికి ఇరువైపులా విడుపుల్లో ద్వారపాలకుల వలె సుమారు రెండు అడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు కనిపిస్తాయి. వీరే శ్రీవేంకటేశ్వరస్వామివారి సంపద లను రక్షించే దేవతలు...! 

Similar News