శ్రీశైలంలో వైభవంగా శ్రీభ్రమరాంబ, మల్లికార్జుస్వామి వార్లకు దవనోత్సవం...
Srisailam: శ్రీశైలంలో దవనోత్సవం నిర్వహించడం ఆనవాయితీ...
![శ్రీశైలంలో వైభవంగా శ్రీభ్రమరాంబ, మల్లికార్జుస్వామి వార్లకు దవనోత్సవం... Sri Bramaramba Mallikarjuna Swamy Davanotsavam in Srisailam Today | Live News](https://assets.hmtvlive.com/h-upload/2022/04/17/1500x900_334428-sri-bramaramba-mallikarjuna-swamy-davanotsavam-in-srisailam-today.webp)
శ్రీశైలంలో వైభవంగా శ్రీభ్రమరాంబ, మల్లికార్జుస్వామి వార్లకు దవనోత్సవం...
Srisailam: శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ, మల్లికార్జుస్వామి వార్లకు దవనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉగాది అనంతరం మొదట వచ్చే చైత్రపౌర్ణమిని పురస్కరించుకొని కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు శ్రీశైలంలో దవనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా క్షేత్రంలోని గంగాధర మండపం ముందుభాగంలో అగ్ని ప్రతిష్ఠాపన చేసి లోక కల్యాణార్థం దవనం, గుగ్గిలం, కర్పూరం తదితర పదార్థాలను అగ్నికి సమర్పించారు. ఈసందర్భంగా కన్నడిగులు శివస్వరూపంగా భావించే కంభీహాలుకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.