శ్రీవారి ఆర్జిత సేవల రద్దుపై వెనక్కి తగ్గిన టీటీడీ...
TTD: భక్తులనుండి విమర్శలు రావటంతో నిర్ణయం మార్పు...
![శ్రీవారి ఆర్జిత సేవల రద్దుపై వెనక్కి తగ్గిన టీటీడీ... TTD Changed the Decision of Cancelling Srivari Arjitha Seva | Live News Today](https://assets.hmtvlive.com/h-upload/2022/05/16/1500x900_335678-ttd-changed-the-decision-of-cancelling-srivari-arjitha-seva.webp)
శ్రీవారి ఆర్జిత సేవల రద్దుపై వెనక్కి తగ్గిన టీటీడీ...
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల రద్దు విషయంపై టీటీడీ వెనక్కి తగ్గింది. వేసవి రద్దీ దృష్ట్యా జూన్ 30వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఇటీవల ప్రకటించింది. కానీ భక్తుల నుండి విమర్శలు రావడంతో టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. సదురు సేవను యధావిధిగా కొనసాగిస్తామని తెలిపింది.