గణపతి బప్పా మోర్యా.. అంటే ఏంటి?

Vinayaka Chavithi 2024: వినాయక చవితి సందర్భంగా గణపతి బప్పా మోరియా అనే నినాదం వాడవాడలా ప్రతిధ్వనిస్తుంది కానీ దీని అర్థం ఏంటో చాలామందికి తెలియదు అసలు గణపతి బప్పా మోరియాలో మోరియా అంటే ఏంటా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ ప్రత్యేక కథనం మీ కోసం

Update: 2024-09-08 06:33 GMT

Vinayaka Chavithi 2024: గణపతి బప్పా మోర్యా.. అంటే ఏంటి?

Vinayaka Chavithi 2024: మన సనాతన ధర్మంలో వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం ఏ పని ప్రారంభించిన తొలి పూజ చేసేది వినాయకుడికే వినాయకుని విఘ్నాలను తొలగించే దేవుడిగా పేర్కొంటారు. వినాయక చవితి సందర్భంగా గణపతికి విశిష్టంగా పూజలు చేస్తారు. కాగా ఈ వినాయక చవితి వేడుకలను కేవలం ఒక రోజుకు మాత్రమే పరిమితం చేయకుండా నవరాత్రులుగా నిర్వహించాలని స్వాతంత్ర ఉద్యమ కాలంలో బాలగంగాధర్ తిలక్ పిలుపునివ్వగా, ఈ వేడుకలను నవరాత్రులుగా మలచి నేటికీ దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

ఈ నవరాత్రుల ఉద్దేశం దేశ ప్రజలందరినీ ఏకత్రాటిపై తేవడమేనని బాలగంగాధర్ తిలక్ పిలుపునిచ్చారు. ఈ నవరాత్రుల వేడుకల్లో సమాజంలో ఉన్న అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వారు అన్ని భాషలవారు ఒకటై తమ సంస్కృతిని కాపాడుకునేందుకు నడుంబిగిస్తారు. అయితే వినాయక చవితి వేడుకల్లో మనందరికీ ఎక్కువగా వినిపించే నినాదము గణపతి బప్పా మోరియా అయితే చాలామందికి ఈ గణపతి బప్పా మోరియా అంటే ఏంటో అర్థం కాదు. ఇది ఒక మరాఠీ పదం కావడం వల్ల దీని అర్థం చాలామందికి తెలియదు.

ఈ మోరియా చరిత్రలోకి వెళ్తే 15వ శతాబ్దంలో మోరియా గోసాని అనే సాధువు పూణేకు 21 కిలోమీటర్ల దూరంలోనే చించువాడా అనే గ్రామంలో నివసించేవాడు అతను గణపతికి పరమ భక్తుడు ప్రతిరోజు గణపతిని పూజించేందుకు కాలినడకన మోరేగావ్ అనే గ్రామానికి నడిచి వెళ్లేవాడు. అయితే ఒకరోజు మోరియా గోసాని నిద్రించి ఉండగా గణపతి కలలో కనిపించి అక్కడ సమీపంలోన నది వద్ద విగ్రహం ఉందని దానిని తీసుకువచ్చి ప్రతిష్టించమని ఆదేశించారట.

దీంతో కలలో చెప్పిన విధంగానే మోరియా విగ్రహాన్ని నది నుంచి తీసుకొని వచ్చి ఆలయాన్ని స్థాపించాడు. అయితే ఈ విషయం స్థానికులకు తెలిసి సాక్షాత్తు గణపతి సాక్షాత్కారం పొందిన మోరియాను పొగడటం ప్రారంభించారు. అప్పటి నుంచి గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. మోరియా గోసాని గణపతి ఉత్సవాల్లో ఒక భాగంగా నిలిచిపోయారు. అందుకే భక్తులంతా గణపతి బప్పా మోరియా అని నినదించడం ఒక భాగంగా మారింది.

Tags:    

Similar News