తిరుమలకు మూడో మార్గం నిర్మించాలని టీటీడీ సంకల్పం...

TTD: ప్రస్తుతం రెండు ఘాట్ రోడ్డులు, రెండు నడక దారులు...

Update: 2022-05-07 04:00 GMT

తిరుమలకు మూడో మార్గం నిర్మించాలని టీటీడీ సంకల్పం...

TTD: తిరుమల శ్రీవారి నడక మార్గంలో మూడో మార్గం నిర్మించేందుకు టీటీడీ పూనుకుంది. కోడూరు నుంచి మూడో మార్గం నిర్మించాలని టీటీడీ సంకల్పించింది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల కోసం రెండు ఘట్ రోడ్డు మార్గాలు, అలాగే రెండు నడక దారాలు ఉన్నాయి. అయితే మూడో మార్గంగా అన్నమయ్య నడిచిన మార్గంగా చెబుతూ కోడూరు నుంచి నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదన టీటీడీకీ వచ్చింది.

టీటీడీ పాలకమండలి అనుమతి కూడా వచ్చేసింది. అయితే మూడోవ మార్గం నిర్మాణంపై అభ్యంతరాలు కూడా వచ్చాయి. మూడో మార్గంతో అనేక నష్టాలు స్థానికులు అంటున్నారు. తిరుపతి ప్రాముఖ్యత దెబ్బతినే అవకాశముందని తిరుపతివాసులు భావిస్తున్నారు. అయితే ఎన్ని అభ్యంతరాలు వచ్చినా 2021, డిసెంబర్ 11న జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో అన్నమయ్య మార్గ నిర్మాణానికి పచ్చ జెండా ఊపారు. సర్వే చేసినటువంటి టీటీడీకి ఇప్పటి వరకు అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చినట్లు లేదు.

శేషాచల అడవుల్లో అన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నాయి. చిన్న సైజు రహదారి నిర్మించాలన్నా అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. దీంతో టీటీడీ తీసుకున్న నిర్ణయం అటవీశాఖ కోర్టులో పడింది. అన్నమయ్య మార్గాన్ని వెంటనే నిర్మిస్తామని, అన్నమయ్య మార్గంలో భక్తులను రాకపోకలు సాగిస్తామని చెప్పిన టీటీడీ ఇప్పటికప్పుడు పనులు మొదలుపెట్టే పరిస్థితులు కనిపించడం లేదు. 

Tags:    

Similar News