సినిమాల్లో పీహెచ్ డీ చేసిన సమంత రాజమండ్రిలో యూటర్న్ తీసుకుంది. ఏమాయ చేశావే సినిమాతో తెరంగ్రేటం చేసిన సామ్ టాప్ హీరోలతో
వరుస సినిమాలతో హిట్లు కొట్టింది. కానీ తాను ఎన్ని బ్లాక్ బ్లాస్టర్ హిట్లు కొట్టినా తనకు ఓ చిరకాల కోరిక ఉన్నట్లు మీడియాకు చెప్పింది. సస్పెన్స్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘యు టర్న్’ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించింది. ఆ సినిమాలో మెయిన్ లీడ్ క్యారక్టర్ చేయాలని ఆశగా ఉందంటూ చెప్పుకొచ్చింది.
కొన్ని రోజుల క్రితం ఆ ప్రాజెక్ట్ కోసం సామ్ - నాగచైతన్యలు కలిసి బెంగళూరు వెళ్లారు. ఆ సినిమా చూసి సామ్..తెలుగు లో ఈ సినిమా చేయనున్నట్లు చెప్పింది. కన్నడం లో దర్శకత్వం వహించిన పవన్ కుమారే తెలుగులోనూ డైరక్ట్ చేస్తాడని అన్నది. రెండేళ్ల కిందట వచ్చిన ‘యు టర్న్’ సినిమా చూసి బాగా ఇంప్రెస్ అయిన సామ్.. ఆ సినిమాను రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటోంది. కానీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేసింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయినట్లు కూడా వార్తలొచ్చాయి.
అయితే సామ్ ఈ మధ్యే సినిమా షూటింగ్ ప్రారంభమైందని ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘యు టర్న్’ చిత్రీకరణ మొదలైన సంగతిని వెల్లడించింది. ఈ సినిమాకు పవన్ కుమార్ డైరక్ట్ చేస్తుండగా సమంత ఈ చిత్రంతో నిర్మాతగా కూడా మారుతోంది. నాగచైతన్యతో కలిసి ఆమె ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఈ స్టోరీ విషయానికొస్తే బెంగళూరులోని ఓ ఫ్లై ఓవర్ మీద వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే కథానేపథ్యంగా యూటర్న్ రూపొందింది. రోడ్డు ప్రమాదంలో వాహనపుదారులు ప్రాణాలు కోల్పోవడంలో కొన్ని అంశాలు అనేక అనుమానాలకు దారితీస్తాయి. సస్పెన్స్, థ్రిల్లర్‌గా రూపొందే ఈ చిత్రం కన్నడలో ఘన విజయం సాధించింది.
యూటర్న్ చిత్రంలో జర్నలిస్టు, పోలీసుల మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.