పరకాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మా రెడ్డి గెలుపొందారు. ప్రజా కూటమి అభ్యర్థి కొండా సురేఖపై దాదాపు 40వేల ఓట్ల ఆధిక్యం సాధించారు. కాగా ఈ ఫలితాల్లో కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మొత్తం 8 సీట్లలో పోటీ చేసిన టీజేఎస్ అన్నింటిలో ఓటమి దిశగా పయనిస్తోంది. మద్యాహ్నం కేసీఆర్ మీడియా సమావేశం.. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడనున్నారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన చేసే అవకాశముంది. పాలేరు నియోజకవర్గంలో 11వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ 1,325 ఓట్ల ముందంజలో ఉన్నారు. టీఆర్‌ఎస్ సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు.