భార‌తీయుల‌కు ట్రంప్ తీపిక‌బురు

Update: 2018-01-28 04:56 GMT


అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌రోతీపిక‌బురు అందించారు. వివిధ దేశాలలోఉన్న త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌తో అమెరికాకు వ‌ల‌స‌వెళ్లేవారు. అలా వీసాలు లేకుండా పిల్ల‌ల్ని తీసుకెళ్లేవారు భార‌తీయులు ఎక్కువ‌గా ఉన్నార‌ని వైట్ హౌస్ అధికారులు తెలిపారు.  అయితే వ‌ల‌స వెళ్లే వాళ్లకు వీసా త‌ప్ప‌ని స‌రి. కానీ పిల్ల‌ల‌కు వీసాలు ఉండేవి కాదు. అలా వీసాలు లేకుండా 6.90ల‌క్ష‌ల‌మంది పిల్ల‌లు అమెరికాలో ఉన్నార‌ని ...అమెరికా అధ్య‌క్ష‌ప‌ద‌వి చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి డొనాల్డ్ ట్రంప్ వారి (డ్రీమ‌ర్ల‌)పై ఆంక్ష‌లు విధించారు. ఆ ఆంక్ష‌ల‌తో పిల్ల‌ల్ని అమెరికాకు తీసుకు వెళ్లాలంటే క‌ష్ట‌త‌ర‌మ‌య్యేది.  ఈ నేప‌థ్యంలో ట్రంప్  దావోస్ లో జ‌రుగుతున్న ప్ర‌పంచ ఆర్ధిక ఫోరం సద‌స్సుకు హాజ‌రు కావాల్సి ఉండ‌గా డ్రీమ‌ర్ల‌పై నిర్ణ‌యం తీసుకున్నారు. డ్రీమ‌ర్లపై కొన్ని ఆంక్ష‌లు స‌డ‌లించే ప్ర‌య‌త్నాలు ప్రారంభిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ నిర్ణ‌యం  డ్రీమ‌ర్ల‌ను ప్రోత్స‌హించేలా ఉంటుంద‌ని..త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని భ‌రోసా ఇచ్చారు.  
కాగా డ్రీమ‌ర్ల‌విష‌యంలో ఇప్ప‌టి వ‌రుకు నిర్ణ‌యం తీసుకోలేద‌ని..ఫిబ్రవరి 6వ తేదీ నాటికి ఒక నిర్ణయానికి వ‌స్తామ‌ని సూచించారు. ఇందుకోసం అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు ప్రతిపక్ష డెమాక్రటిక్ పార్టీ సభ్యులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం మేరకే ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోకుండా స్వల్పకాలిక ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి డెమోక్రాట్లు ఆమోదం తెలిపారు.
 

Similar News