తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ ఉదయం 7:30 గంటలకు వరాహ పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం మహోత్సవం జరిగింది. రాత్రి 8 గంటలకు శ్రీవారి ఆలయంలో ధ్వాజారోహణ కార్యక్రమం జరగనుంది. గురువారం స్వామివారికి అశ్వవాహన సేవ వైభవంగా సాగింది. శ్రీనివాసుడు బంగారు పగ్గం పట్టుకుని అశ్వవాహన రూడుడై తిరుమాడ వీధుల్లో విహరించారు. అలాగే సూర్యుని కిరణ కాంతుల్లో మేరు పర్వతం వంటి రథంలో శ్రీదేవి భూదేవిలతో కలిసి ఊరేగారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.