తిరుమల బ్రహ్మోత్సవాలలో ఇవాళ ఉదయం మలయప్పస్వామి చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చిన్న శేషవాహనంపై వెంకటేశ్వరుడు మురళీమనోహారుడి రూపంలో భక్తులను భక్తి పరవశంలో ముంచెత్తాడు శ్రీవారు. పెద్దశేషవాహనాన్ని అదిశేషుడిగానూ, చిన్నశేష వాహనాన్ని వాసుకి సర్పంగానూ భావిస్తారు. చిన్న శేష వాహనంపై శ్రీనివాసుడిని దర్శించి, ధ్యానించడం ద్వారా మనిషిలోని మనోవృతులు నశిస్తాయని అంటారు. చిన్నశేష వాహనాన్ని దర్శించిన భక్తులకు కుండలిని యోగం సిధ్ధిచడంతో పాటు సమస్త నాగదోషాలు తొలుగుతాయని పురాణాల్లో చెప్పారు.