ఓ వైపు డైరక్టర్ గా అవకాశాలు రాక వెంకీ అట్లూరి యాక్టర్ గా సెటిల్ అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ ప్రయత్నాలు ఫలించి ఓ రెండు సినిమాల్లో యాక్ట్ చేసినా పెద్దగా పేరుత రాలేదు. దీంతో తన హాట్ సీట్ కోసం ప్రయత్నాలు చేసిన వెంకీ అట్లూరి తొలిప్రేమను తెరకెక్కించాడు. ఫీల్ గుడ్ లవ్ తో తెరపైకి స్మార్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో వరుణ్ కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో సినిమా అన్నీ సెంటర్లలలో ఇరగదీస్తుంది.
సింపుల్ లవ్ స్టోరీగా అందరికి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో కలెక్షన్స్ కూడా సినిమాకు బాగానే వచ్చాయి. మొత్తంగా సినిమా విడుదలైన 9 రోజుల్లో 38.5 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇక షేర్స్ పరంగా సినిమా 21కోట్లను రాబట్టింది. ఫిదా తరువాత వరుణ్ కెరీర్ లో ఇదే బెస్ట్ కలెక్షన్స్. వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే మొత్తంగా సినిమా 23 కోట్లకు అమ్ముడుపోయింది. ఇండియాలో రిలీజ్ చేసుకున్న దిల్ రాజుకి మరి ఎక్కువ లాభాలు కాదు గాని గత సినిమాలతో పోల్చుకుంటే బెటర్ అమౌంట్ దక్కింది.
ఇక మొత్తంగా ఏరియాలను బట్టి వరల్డ్ వైడ్ షేర్స్ ఇలా ఉన్నాయి.
నైజాం. 6.20 కోట్లు
వైజాగ్ 2.56 కోట్లు
ఈస్ట్. 1.38 కోట్లు
వెస్ట్ 1.06 కోట్లు
కృష్ణ. 1.24 కోట్లు
గుంటూరు. 1.31కోట్లు
నెల్లూరు 0.50 కోట్లు
సీడెడ్. 9.5కోట్లు
తెలంగాణ+ఆంద్ర 16.2 కోట్లు
యూఎస్. 2.7 కోట్లు
కర్ణాటక. 1.2 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.9 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ - 21 కోట్లు