రామాయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ.. ఉదాహరణ సీతమ్మవారే!

Update: 2018-06-01 11:00 GMT

ఇటీవల హిందీ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిధిగా ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ  హాజరయ్యారు. ఆ సందర్బంగా పాత్రికేయంపై మాట్లాడిన శర్మ పాత్రికేయం మహాభారతం కాలం నుంచే ఉందని, ఇప్పుడున్న గూగుల్ అప్పట్లోనే ఉందన్నారు.  దానికి ఉదాహరణ ముల్లోకాల సంచారి నారాధమునేనని అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే తాజాగా టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ కార్యక్రమానికి హాజరయ్యారు శర్మ ఈ విషయంపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామాయణ కాలంలోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల ఎరా మొదలైందని , సీతమ్మవారు మట్టికుండలో జన్మించారని పెద్దలు చెబుతున్నారు. దీన్ని బట్టి  అప్పట్లోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల ఎరా మొదలైనట్లు తెలుస్తోందని దినేశ్‌ శర్మ వ్యాఖ్యానించారు.  

Similar News