మహిళా టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ స్టార్ అమెరికన్ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ మాతృత్వం కోసం గొప్ప పోరాటమే చేసింది. చివరకు ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. తన పాప ఒలింపియా కోసం తాను మృత్యువుతో పోరాడాల్సి వచ్చిందని దాదాపుగా చనిపోయాననే అనుకొన్నానని వైద్యుల అంకితభావం, ప్రావీణ్యం కారణంగానే తాను బతికానని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకొంది. ప్రసవసమయంలో తాను ఊపిరితిత్తుల్లో గడ్డలతో బాధపడ్డానని ఊపిరి అందక బీపీ విపరీతంగా పెరిగిపోయిందని వాపోయింది. అత్యవసరంగా సిజేరియన్ చేయటం ద్వారా తాను పాపకు జన్మనివ్వగలిగానని ఆరువారాలపాటు ఎలా బ్రతికానో ఇప్పటికీ తనకు అంతు పట్టడం లేదని చెప్పింది. 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా ప్రస్తుతం తన కూతురు చిన్నారి ఒలింపియాతోనే ఎక్కువసమయం గడుపుతూ ఓ తల్లిగా మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది.