సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని కేసీఆర్ చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి కార్యక్రమం లేదు. సమైక్య రాష్ట్రంలో 265 టీఎంసీల సామర్థ్యం ఉన్న చెరువులను ధ్వంసంచేశారన్నారు,. తెలంగాణలో మిషన్ కాకతీయ పేరుతో 46వేల చెరువులను పునరుద్ధరించుకుంటున్నామని చెప్పారు. రహదారులు నిర్మించుకుంటున్నాం. కొత్త జిల్లాలను ఏర్పాటుచేసుకున్నాం. పెన్షన్లు పెంచుకున్నామని తెలిపారు. ఒంటరిమహిళ, వితంతువులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏం చేస్తున్నదో వారిని అడిగితే తెలుస్తుంది. 50% సబ్సిడీపై చేనేత కార్మికులకు రంగులు అందిస్తూ వారు తయారుచేసిన వస్ర్తాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి పథకాలతో దూసుకుపోయామన్నారు. అన్ని వర్గాల పిల్లలకు 119 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేశామన్నారు. సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉంటున్నాం. ఇదంతా ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతోనే సాధ్యమవుతున్నదని ప్రశంసించారు.