తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బడ్జెట్ సమావేశాలు కావటంతో శాసనసభ, శాసన మండలి సభ్యులు సంయుక్తంగా అసెంబ్లీలో సమావేశం కాగా, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావిస్తారు. ఈ సమావేశాలు రెండువారాల పాటు కొనసాగే అవకాశం ఉంది.