మలేషియాలో మిస్ వరల్డ్ టూరిజం కాంటెస్ట్ పోటీలు ఘనంగా జరిగాయి. ప్రతీ సంవత్సరం మగువల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఈ పోటీలు జరుగుతాయి. ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి ఔత్సాహికులైన మగువలు పాటిస్పెంట్ చేస్తారు. అలా 2016 మిస్ వరల్డ్ టూరిజం కాంటెస్ట్ లో పాల్గొన్న రష్యన్ మోడల్ డరియా ఖోహ్లోవా (19) మిస్ బికినీ వరల్డ్ టైటిల్ ను గెలుచుకుంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియాతో షేర్ చేసుకుంది. "నాలుగు రోజుల్లో నా జీవితం పూర్తిగా మారిపోయింది, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నాలుగు రోజుల్లో నేను ఒక అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి పోటీల్లో విజయం సాధిస్తానని ఎప్పుడూ ఆలోచించలేదు అంటూ తన అనుభవాల్ని షేర్ చేసింది.