హైదరాబాద్‌లో మెట్రోరైలులోసాంకేతిక లోపం తలెత్తింది. బాలానగర్ అంబేద్కర్ స్టేషన్‌లో రైలు నిలిచిపోయింది. మియాపూర్ నుంచి అమీర్ పేట్ వెళుతున్న రైలు కరెంట్ సప్లయ్ లేకపోవడంతో ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో మియాపూర్ నుంచి ఎర్రగడ్డ వరకు మెట్రోసేవలు నిలిచిపోయాయి. ఈ ఘటనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణీకులు ఆందోళన చేపట్టారు.