కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తో భేటీ అయ్యారు. ఈసందర్భంగా తమ్మారెడ్డికి - శ్రీరెడ్డికి మధ్య చిన్న వాదన జరిగింది.
కాస్టింగ్ కౌచ్ ఎదురైతే ..అలా చేసిన వారిని గురించి ఎందుకు మాట్లాడడంలేదని తమ్మారెడ్డి ప్రశ్నించారు. అందుకు సమాధానంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ కాస్టింగ్ గురించి మాట్లాడకపోవడానికి కారణం భయమని చెప్పుకొచ్చారు. అతడు ప్రాబ్లం చేశాడని చెప్పి కంప్లయింట్ చేస్తే నెక్ట్స్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఈ అమ్మాయి ఏదో తలనొప్పులు పెడుతోంది అని అవకాశాలు ఇవ్వడం లేదు. ఆ భయంతోనే చాలా మంది ఇలాంటి సంఘటనలు ఎదురైనా బయటకు రావడం లేదు అని శ్రీరెడ్డి తెలిపారు.
కొంతమంది దర్శకలు హీరోయిన్లను గౌరవించరని , హీరోయిన్ ఎదురుగా ఉంటే పాప అని పక్కకు వెళ్లిన పరుషపదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడతారని చెప్పింది. కాబట్టి తెలుగు సినిమా పరిశ్రమకు చీడపురుగుల్లా తయారయ్యారు. వారిని మార్చాలనేది నాలక్ష్యం.
చిన్న చిన్న వాళ్లు కాదు. కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల్లో చాలా పెద్ద పెద్ద వారు ఉన్నారు. దానికి సంబంధించిన సమాచారం మేము గ్యాదర్ చేశాం. కచ్చితంగా వాటిని త్వరలో బయట పెడతాం అని శ్రీరెడ్డి వెల్లడించారు.
తెలుగు అమ్మాయిలను తప్పకుండా తీసుకోవాలనే రూల్స్ పెట్టాలి. అది జరిగే వరకు తాము పోరాడుతూనే ఉంటాము అని చెప్పారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరిట ఫ్రీగా భూములు దొబ్బి స్టూడియోలు కట్టించుకున్నారు. అందులో చాలా చీకటి పనులు జరుగుతున్నాయి. కళా రంగానికి సేవ చేస్తామని కోట్ల రూపాయల విలువ చేసే భూములు తీసుకుని శృంగారానికి ఎలా వాడుకుంటారు? అవేమైనా బ్రోతల్ హౌసులా? స్టూడియోలా? అంటూ శ్రీరెడ్డి వాదనకు దిగారు.
దీనికి తమ్మారెడ్డి వెంటనే స్పందిస్తూ బ్రోతల్ హౌస్ అనే పదం చాలా పెద్ద పదం అంటూ ఆమె వాదనను ఖండించే ప్రయత్నం చేశారు. మీకు ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు. మేం చాలా నలిగిపోయి ఉన్నాం. వాటిని ప్రూఫులతో సహా బయట పెడతాం అని శ్రీరెడ్డి తెలిపారు.
లాడ్జిల్లో 500, 200లకు వెళ్లే చిన్న చిన్న వారిని పట్టుకుని ఏదో పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్లు చేశామని చెప్పడం కాదు. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు కాకుండా ఇలాంటి బడాబాబుల తాటలు ఒలవాలంటే స్టూడియోలకు వెళ్లి రైడ్స్ చేయండి. చాలా మంది దొరుకుతారు అని శ్రీరెడ్డి తెలిపారు.