రాఘవ లారెన్స్ డాన్స్ మాస్టర్ స్థాయి నుండి దర్శకుడిగా, హీరోగా ఎదిగాడు. తను ఏ స్థాయి నుండి వచ్చాడనే విషయాన్ని లారెన్స్ ప్రతి సందర్భంలో గుర్తుచేస్తూనే ఉన్నారు. తను కష్టపడి సంపాదించిన మొత్తంలో చాలా వరకు సేవా కార్యక్రమాలకు వినియోగించడం లారెన్స్ కూడా అలవాటు. రకరకాల మార్గల ద్వారా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుండే లారెన్స్ " లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ తో వివిధ రకాల జబ్బులతో బాధ పడుతున్న వంద మందికి పైగా పిల్లలకు ఆపరేషన్స్ చేయించాడు. అంతేకాదు సమాజం చిన్న చూపు చూసే హిజ్రాలకు తనవంతు సహాయం చేస్తుంటాడు. ఆయన రూపొందించిన సినిమాలో కూడా వారి ప్రస్తావన తీసుకొచ్చారు. నిజజీవితంలో కూడా ఆయనకు హిజ్రాలంటే చాలా ఇష్టమని.. తన టీంలో వారు ఉన్నారని, వారికి సెంటిమెంట్‌గా భావిస్తానని అన్నారు.
లారెన్స్ సినిమా విడుదలవుతుంటే వెంటనే ఎంతోకొంత డబ్బును హిజ్రాల కోసం ఓపెన్ చేసిన అకౌంట్‌లో వేస్తాడట. అది ఆయనకొక సెంటిమెంట్‌గా మారిందని చెప్పారు. ఇక అసలు విషానికొస్తే కొద్దిరోజుల క్రితం రాఘవ లారెన్స్ తో ఫోటో దిగేందుకు శేఖర్ అనే అభిమాని కన్నుమూశాడు. దీంతో సమాచారం అందుకున్న లారెన్స్ అతని అంత్యక్రియలకు హాజరై కన్నీటి పర్యంతమయ్యాడు. అభిమాని మరణంతో కలత చెందిన లారెన్స్ ఓ నిర్ణయానికొచ్చారు. అభిమానులు ఫోటో దిగాల్సి వస్తే నా దగ్గరకు వచ్చే అవకాశం లేకుండా నేనే అభిమానులతో ఫోటోలు దిగుతా. దయచేసి ఎవరు నాకోసం మీ ప్రాణాల్ని పెట్టొద్దు. నా అభిమాన సంఘాలు ఎక్కడుంటే అక్కడికి వారితో ఫోటో దిగుతా. మొదటగా నేను దీన్ని 7వ తేదీన సేలం నుంచి ప్రారంభిస్తున్నానని చెప్పుకొచ్చారు.
గతేడాది వారసత్వంగా వస్తున్న జల్లికట్టుపై ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ పోరాటంలో యోగేశ్వర్ అనే యువకుడు ప్రాణాలొదిలాడు. జల్లికట్టుకు మద్దతిచ్చిన లారెన్స్ యోగేశ్వర్ అంత్యక్రియలకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆ కుటుంబంలో యోగేశ్వర్ పాత్ర పోషిస్తా. అతను తనకుటుంబానికి ఏం చేయాలనుకుంటున్నాడో అన్నీ నేనే చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ రోజు యోగేశ్వర్ కోసం నేను కట్టించిన ఇంటి గృహ ప్రవేశం. ఇది సాయం కాదు నా కర్తవ్యం. మీ అందరి దీవెనలు, సపోర్ట్ నాకు కావాలి’’ అంటూ లారెన్స్ ట్వీట్ చేశారు.