టీమిండియా కెప్టెన్ పై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తప్పుడు నిర్ణయాలతో ఆటగాళ్ల ప్రతిభను తొక్కే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం టీమిండియా- సౌత్రాఫ్రికా ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే టెస్ట్ కోసం జట్టులో మార్పులు జరిగాయి. ఆ మార్పులపై సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ధవన్, భువనేశ్వర్‌లను తొలగించి వాళ్ల స్థానంలో రాహుల్, ఇశాంత్‌లను సెలక్ట్ చేసుకోవడం సరైందని కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్ కోహ్లీని తప్పుబట్టిన మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీం ఇండియాలో శిఖర్ ధవన్ ఎప్పుడూ ‘బలీ కా బకరా’ అని ఆయన అన్నారు. అతని తలపై ఎప్పుడూ కత్తి వేళ్లాడుతునే ఉంటుంది’’ .ఒకటెస్టులో విఫలం అయితే మరో టెస్ట్ లో స్థానం కోల్పోతున్నాడని తెలిపారు. కేప్‌టౌన్ టెస్ట్‌లో తొలి రోజే మూడు వికెట్లు తీసిన భువనేశ్వర్‌ని జట్టులో కొనసాగించి షమీ లేక బుమ్రాని జట్టులోంచి తప్పించి వాళ్ల స్థానంలో ఇశాంత్‌ని తీసుకోవాల్సింది’’ అని అన్నారు.