కాఫీ త్రాగితే మానసిక ఒత్తిడినుంచి ఉపశమనం కలుగుతుందని కొందరంటారు. కాఫీ త్రాగడం వలన గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటిస్ లాంటీ వ్యాధులు దూరమవుతాయని కూడా చెబుతుంటారు. అయితే కొందరికి కాఫీ త్రాగడం వలన కడుపు నొప్పి వస్తుంటుంది. అసలిది ఎదుకు వస్తుంది, నిజంగా కాఫీ త్రాగడం వలన కడుపు నొప్పి వస్తుందా..? అంటే అవుననే అంటున్నారు కొందరు. వాస్తవానికి కాఫీ త్రాగే అలవాటు 100 మందిలో 60 మందికి మాత్రమే ఉంటుంది. కాఫీలో కెఫైన్ ఉంటుంది. అలవాటుగా నిత్యం తీసుకుంటే ఆరోగ్యంపై ఎటువంటి మార్పు ఉందదు..
కానీ ఈ కెఫైన్ అప్పుడప్పుడు శరీరంలో చేరితే గ్యాస్ ప్రభావంతో కొంత మంటగా ఉంటుంది. అది స్వల్ప కడుపునొప్పికి దారి తీస్తుంది. అంతేకాని దీని వలన ఎటువంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ఎంచుకునే కాఫీ పౌడర్‌ని బట్టి కూడా ఆరోగ్యంపై కొంత వరకు ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయంటున్నారు పరిశోధకులు. అందరి శరీరతత్వం ఒకలా ఉండదు. కొంతమంది రోజుకి 4,5 కప్పుల కాఫీ తాగినా ఏమీ అనిపించదు. కొందరికి ఓ కప్పు కాఫీ తాగితే చాలు.ఆరోజంతా తెలియని ఉత్సాహం. అంతకు మించి అస్సలు తాగలేరు. బలవంతంగా తాగితే ఇబ్బంది పడుతుంటారు.