ట్యాంపరింగ్‌: ‍​కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్మిత్‌

Update: 2018-03-25 10:57 GMT

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో ఆసీస్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడిన ఆటగాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాను ఆదేశించింది. దీంతో కెప్టెన్  స్మిత్ తో పాటు వైఎస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పై వేటు వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యవహారంలో పూర్తి స్దాయి విచారణ జరిపిన తరువాత ఇతర ఆటగాళ్లపై వేటు వేసే అంశాన్ని పరిశీలించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. ఇక ఐపిఎల్ లో రాజస్దాన్ రాయల్స్ కు నేతృత్వం వహిస్తున్న స్మిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇదే సమయంలో ట్యాంపరింగ్ వివాదంపై తీవ్రంగా స్పందించిన ICC   బాన్ క్రాఫ్ట్ పై ఒక మ్యాచ్ నిషేధంతో పాటు మ్యాచ్ ఫీజులో వందశాతం కోత విధించింది.  
 

Similar News