అందాల తార శ్రీదేవి చనిపోయిందన్న వార్త దేశాన్ని కుదిపేసింది. కోట్లాది ప్రేక్షక గుండెల్లు అల్లాడిపోయాయి. ఈనెల 24న దుబాయ్ హోటల్ లో చనిపోయింది శ్రీదేవి. అయితే శ్రీదేవి గుండెపోటుతో చనిపోయిందని ఆమె బంధువులు ప్రకటించారు. దీంతో అందరూ అదే అనుకున్నారు. అయ్యే ఆరోగ్య కరంగా కనిపించే శ్రీదేవికి కార్డియాక్ అరెస్ట్ ఎలా వచ్చిందని ఆవేదన పడ్డారు. కానీ ఫోరెన్సిక్ రిపోర్టు శ్రీదేవి మృతిని మరో మలుపు తిప్పింది. శ్రీదేవి బాత్ టబ్ లో పడిపోయి చనిపోయిందనేది నిర్ధారణలో తేలింది. టబ్ లో మునిగి తుది శ్వాస విడించిందని ఫోరెన్సిక్ డాక్టర్లు రిపోర్టు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా శ్రీదేవి మృతిపై అనుమానాలు పెరిగాయి. 5.6 అంగుళాల పొడవు , ఆరోగ్యంగా ఉండే శ్రీదేవి టబ్ లో పడి ఎలా చనిపోయిందనే అనుమానాలు మిగిలిపోయాయి.
దీంతో దుబాయ్ ప్రాసిక్యూషన్ కు అప్పగించారు దుబాయ్ పోలీసులు. ఈ పరిణామాలతో కేసుపై అనుమానాలు మరింత బలపడ్డాయి. కేసు విచారణ ప్రారంభించిన ప్రాసిక్యూషన్ ఫోరెన్సిక్ రిపోర్టుపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో రీ ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించింది.
రీపోస్టుమార్టంకు ఆదేశిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బోనీ కపూర్ ను అరెస్ట్ చేశారన్న పుకార్లువినపడ్డాయి.
కానీ కేసు మొత్తం స్టడీ చేసిన ప్రాసిక్యూషన్ పోలీసులు , ఫోరెన్సిక్ రిపోర్టులు కేసులో ఎలాంటి అనుమానాలు లేవని దుబాయ్ మీడియాలో ట్వీట్ చేసింది. ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో పడి చనిపోయినట్లు ప్రాసిక్యూషన్ దృవీకరించినట్లు చెప్పింది. కేసు ఓ కొలిక్కివచ్చాక కేసును క్లోజ్ చేసి శ్రీదేవి భౌతిక కాయాన్ని ఆమె బంధువులకు ఇచ్చేలా ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంబామింగ్ విషయంలో కూడా అదే తేలింది. అయితే శ్రీదేవి మృతిపై అనుమానాలు ఉన్నాదుబాయ్ యంత్రాంగం కేసును క్లోజ్ చేయడం ఆ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.