శ్రీదేవి భౌతికకాయం ఈరోజు కూడా ఇండియాకు రావడం కష్టమేనని ప్రాసిక్యూషన్ చెబుతోంది. శ్రీదేవి మరణంపై విచారణ చేపట్టిన ప్రాసిక్యూషన్ బోనీకపూర్ తో సహా ముగ్గురు వాంగ్మూలం తీసుకుంది. ఆ వాంగ్మూలలో బోనీ కపూర్, అతని కుటుంబసభ్యులు , హోటల్ సిబ్బంది చెప్పిన సమాధానాలకు పొంతనలేకపోవడంతో కేసును లోతుగా విచారించాలని స్పష్టం చేసింది. దీంతో బోనీ పాస్ పోర్టును , ఫోన్ కాల్ డేటా ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి మరణానికి ముందు ఆమె ఎవరికో ఎక్కువ సార్లు ఫోన్ చేసినట్లు తేలింది. ఇంతకీ ఆమె చేసిన ఫోన్ నెంబర్ ఎవరిది అనే విషయం పై ఆరా తీస్తున్నారు.
ప్రమాదవశాత్తు బాత్ టబ్ పడిందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఆమె శరీరంలో ఆల్కాహాల్ గుర్తించినట్లు వెల్లడించారు. అయితే.. అసలు శ్రీదేవి ఒక్కరే మద్యం తాగారా? ఎక్కడ తాగారు? ఎవరితో కలిసి తాగారు? బోనీ కపూర్ ముంబై వెళ్లి వచ్చారా లేదా? ఆమెను ఎవరైనా తోసేశారా? మద్యం మత్తులో టబ్లో పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తొలుత శ్రీదేవి కుటుంబ సభ్యులు కొందరు కార్డియాక్ అరెస్ట్ అని ఎందుకు చెప్పారనే కీలక అనుమానం రేకెత్తుతోంది. మృతిపై అబద్దం ఎందుకు చెప్పారనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా ఆమె ఆత్మహత్య చేసుకుందన్న ప్రచారం కూడా ఒకటి పెద్ద ఎత్తున సాగుతోంది.
మరోవైపు శ్రీదేవికి కార్డియాక్ అరెస్ట్ అని ఆమె సన్నిహితులు నమ్మలేకపోతున్నారు. వాళ్ల ఫ్యామిలీ హిస్టరీలో అలా ఘటనలు ఏవీలేవంటున్నారు. పైగా ఆరోగ్యంపట్ల శ్రీదేవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. రెగ్యులర్ చెకప్స్ కూడా చేయించుకుంటారు. సో శ్రీదేవి కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారా లేక ఆమె మరణం వెనుక మరేదైనా కోణం ఉందా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.