కేసు క్లోజ్ అని తేల్చారు. ఇన్వెస్టిగేషన్ ఎండ్ చేశారు. డెత్ సర్టిఫికెట్ లోను ఆమె ప్రమాదవశాత్తు వల్ల ప్రాణాలు కోల్పోయారు అని రిపోర్టు ఇచ్చారు. కానీ అనుమానాలు మాత్రం మిగిలే ఉన్నాయి. సరిగ్గా ఒక్కరోజు ముందే శ్రీదేవి మరణంపై ఫోరెన్సిక్ రిపోర్టును విడుదల చేసింది. అయితే కేసు లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో విచారణ చేపట్టిన దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఫోరెన్సిక్ ను కొట్టిపారేసింది. బాత్ టబ్ లో పడి చనిపోవడం ఏంటని ప్రశ్నించింది. ఇలా దుబాయ్ పోలీసులకు చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి.
- అసలు రూంనెంబర్ 2201లో ఏంజరిగింది.
- 24 రాత్రి హోటల్ గదిలో ఏం జరిగింది.
- టబ్ లో పడిపోవడం ప్రమాదవశాత్తు జరిగిందా..? కాదా..?
- యాక్సిడెంటల్ అని అప్పుడే ఎలా నిర్ధారణకు వస్తారు.
- ఆపస్మారక స్థితిలో బాత్ టబ్ లో పడిందని రిపోర్టు ఇచ్చారు.
- అపస్మారకస్థితి అయితే ఎందువల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
- శ్రీదేవికి గుండె పోటు వచ్చిందా ..? లేదా..?
-కార్డియాక్ అరెస్ట్ తోనే టబ్ లో మనిగిపోయిందా.
- మరి గుండెపోటుపై రిపోర్టులో ఎందుకు వెల్లడించలేదు.
- గుండెపోటు వదంతుల్ని ఎవరు వ్యాప్తి చేశారు...? ఎందుకు చేశారు..?
-ఆల్కహాల్ మత్తులో టబ్ లో పడిపోయిందా..?
- ఆల్కహాల్ నిజమైతే ఆమెనే తాగిందా..? ఎవరైనా తాగించారా..?
- ఆల్కహాల్ సరఫరా చేసింది ఎవరు..?అందులో ఏమైనా మత్తు కలిపారా..?
- ఆరోగ్యంగా ఉన్న శ్రీదేవి బ్యాలెన్స్ కోల్పోయి పడిపోవడం సాధ్యమేనా..?
- హోటల్ గదిలో నుంచి శ్రీదేవి రెండు రోజులు బయటకు రాలేదా..?
- చివరిసారిగా శ్రీదేవిని చూసింది ఎవరు..?
- హోటల్ సీసీటీవీ పుటేజీ ఎందుకు విడుదల చేయలేదు...?
- శ్రీదేవి డెత్ టైంలో బోనీ కపూర్ ముంబైలోనే ఉన్నాడా..?
- లేదంటే దుబాయ్ హోటల్ గదిలోనే ఉన్నాడా..?
- బాత్రూంలో అచేతనంగా ఉందని బోనీ కపూర్ ఎప్పుడు గుర్తించాడు...?
- హోటల్ లోని ఎమర్జెన్సీ హెల్ప్ సర్వీసును వినియోగించలేదా..?
ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. మరి దేశం కాని దేశంలో చనిపోయిన శ్రీదేవి మిస్టరీ మరణాన్ని ఎవరు చేధిస్తారు. మన సీబీఐ రంగంలోకి దిగి అనుమనాల్ని నివృత్తి చేస్తుందా...?
ముంబై పోలీసులు తిరిగి ఈ కేసును విచారణ చేస్తారా..?