కోడి కత్తి దాడి కేసులో జగన్‌కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తులో జగన్ వాంగ్మూలం అత్యంత కీలకమైనందున స్టేట్‌మెంట్ ఇవ్వాలని సిట్ కోరింది. మరోవైపు ఇదే కేసులో జగన్‌కు నోటీసులు జారీ చేసిన విశాఖ కోర్టు దాడి జరిగిన రోజు ధరించిన చొక్కాను అందజేయాలని ఆదేశించింది.
కోడి కత్తి దాడి కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడి ఘటనలో వాంగ్మూలం ఇవ్వాలని కోరింది. స్టేట్‌మెంట్ ఇవ్వడానికి గతంలో జగన్ నిరాకరించడంతో సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. కేసు దర్యాప్తులో జగన్ వాంగ్మూలం అత్యంత కీలకమైనందున స్టేట్‌మెంట్ ఇవ్వాలని సిట్ కోరుతోంది.
మరోవైపు ఇదే కేసులో జగన్‌కు, ఆయన పీఏకు విశాఖ కోర్టు నోటీసులు జారీ చేసింది. దాడి జరిగిన సమయంలో ధరించిన జగన్ చొక్కాను నవంబర్ 23లోగా దర్యాప్తు అధికారులకు అందజేయాలని కోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో చొక్కా కీలకమని సిట్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆదేశాలిచ్చింది.
అయితే జగన్‌పై జరిగిన దాడి వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తముందని వైసీపీ నేత ఇక్బాల్ ఆరోపించారు. నిందితుడు శ్రీనివాసరావు కిరాయి హంతకుడన్నారు. ఒకవైపు విశాఖ కోర్టు నోటీసులు మరోవైపు సిట్ నోటీసులు ఇంకోవైపు స్వతంత్ర సంస్థతో దర్యాప్తు కోరుతూ హైకోర్టులో జగన్ పిటిషన్ ఇన్ని పరిణామాల నేపథ్యంలో జగన్ వాంగ్మూలం ఇస్తారా? లేదా? చొక్కాను సిట్‌కు అప్పగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.