టీమిండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓపెనర్ శిఖర్ ధావన్.. టీమ్ మేట్స్‌ను ఆటపట్టించడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఐపీఎల్ పదకొండో సీజన్‌లో సన్‌రైజర్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడంతో ధావన్ మాంచి మూడ్‌లో ఉన్నాడు. ఈ విజయాలతో ఉత్సాహంగా ఉన్న సన్‌రైజర్స్ ఆటగాళ్లు మైదానంలో ఆటను ఆస్వాదించడమే కాకుండా ఆఫ్‌ది ఫీల్డ్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రయాణ సమయాల్లో సహచర ఆటగాళ్లతో జోకులు పేల్చుకుంటూ.. వినూత్నంగా ఫొటోలకు ఫోజులిస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం సన్‌రైజర్స్‌హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధావన్ విమానంలో చేసిన ఓ కొంటె పని నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ధావన్.. గాఢంగా నిద్రపోతున్న సహచర ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, రషీద్‌ఖాన్‌లను ఆటపట్టించాడు. ఓ పేపర్‌ను గుండ్రంగా చుట్టి దానితో ఈ ఆటగాళ్ల ముక్కుల్లో పెడుతూ.. వారిని నిద్ర చెడగొట్టాడు. తొలుత ఏం జరుగుతుందో అర్థం కానీ ఈ ఆటగాళ్లు తేరుకొని ఇది గబ్బర్ పనేనని లైట్ తీసుకున్నారు. అయితే ఈ సమయంలో ఇతర ఆటగాళ్లు నవ్వును ఆపుకోలేకపోయారు.