"సీక్రెట్ సూపర్ స్టార్ " సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా హీరో అమిర్ ఖాన్ గురించి చెప్పుకోవాలి. బాలీవుడ్ ఖాన్ త్రయంలో అమీర్ ఖాన్ స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతీ సినిమా ప్రేక్షకుల హృదయాన్ని తాకేలా ఉండేందుకు తహతహలాడుతుంటాడు. అంతేకాదు కథల ఎంపిక విషయంలో, ఆ సినిమాలోని పాత్రకోసం ఖాన్ పడే కష్టం అంతా ఇంతా కాదు త్రీ ఇడిట్స్ లో స్టూడెంట్ గా , పీకే లో ఏలియన్ తరహాలో యాక్టింగ్ , దంగల్ సినిమాలో భానపొట్టతో తన కూతుళ్లను మల్ల యోధులుగా తీర్చిదిద్దేలా తన శరీర ఆకృతుల్ని మలుచుకున్నాడు. తండ్రి పాత్రలో భానపొట్టకోసం రోజు వందల కొద్ది సమోసాలు తిని శరీరాన్ని సినిమాకి తగ్గట్లు మార్చుకున్నాడు. కాబట్టే అమిర్ ఖాన్ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. ఆ విషయం అటుంచితే అమీర్ కొత్త సినిమా "సీక్రెట్ సూపర్ స్టార్ " సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కనక వర్షం కురిపింస్తుందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అద్భుతమైన టాక్ తో దూసుకెళుతున్న ఈ సినిమా కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్లు వసూలు చేసినట్లు టాక్
భారత్ లో గత ఏడాది అక్టోబర్ 10న విడుదలై రూ.100కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ సినిమా చైనాలో రిలీజ్ అయింది. అయితే అమీర్ సినిమా విడుదలతో అక్కడి ప్రజలు థియేటర్ల వైపు క్యూకడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో వచ్చిన అమీర్ ఖాన్ సినిమాలు పీకే, దంగల్ సినిమాలు చైనా థియేటర్లను షేక్ చేశాయి. ఇప్పుడు సీక్రెట్ సూపర్ స్టార్ కు ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. కేవలం రెండు రోజుల్లో ఈ సినిమా రూ.100కోట్లు వసూలు చేసిందని ఏడు రోజుల్లో దాదాపు రూ. 300 కోట్లు వసూలు చేసినట్లు క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.