నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అ అనే చిత్రం ఈ వారం విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మేకింగ్ నుంచి టీజర్ రిలీజ్ వరుకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఎవరి పాత్ర ఏంటో అర్ధకాకుండానే నిర్మాత నాని టీజర్ రిలీజ్ చేయడం విశేషం. ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రా వెస్ట్రన్ ఔట్ ఫిట్స్.. స్టైలింగ్ తో ఆకట్టుకుంటుంది. రెజీనా గెటప్ చూస్తే హాలీవుడ్ లో ఆస్కార్ కు నామినేట్ అయిన యాక్ట్రెస్ రూనీ మురా..లిజబెత్ సలెండర్ పాత్రలో 'ది గాళ్ విత్ ది డ్రాగన్ టాటూ' మూవీలో యాక్ట్ చేసింది. అందులో రూనీ డ్రగ్ ఎడిక్టర్. నానీ నిర్మాత గా వ్యవహరిస్తున్న ఆ సినిమాలో రూనీ పోలికలతో ఉన్న రెజీనా డ్రగ్స్ ఎడిక్ట్ గా కనిపిస్తుందేమోనని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. హీరోయిన్ నిత్యా మీనన్ ఈ సినిమాలో లెస్బియన్ పాత్రలో కనిపించనుంది.
అయితే ఆ సినిమా విడుదలతో బిజీగా ఉన్ననాని వరుసగా సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ రిలీజ్ తక్షణమే రెండు పెద్ద ప్రాజెక్ట్ లలో యాక్ట్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఛలో మూవీతో సక్సెస్ సాధించిన దర్శకుడు వెంకీ కుడుములతో సినిమా చేసేందుకు నాని ఉత్సాహంగా ఉన్నాడని.. స్టోరీ ఉంటే చెప్పమని ఆఫర్ ఇచ్చాడని టాక్ వచ్చింది. అంతే కాదు.. ఫిదా మూవీతో తనలోని వైవిధ్యతను నిరూపించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఈ రెండింటి మీదా రియాక్ట్ అయిన నాని అలాంటిది ఏం లేదని కొట్టిపారేశాడు. ఇలా వెంటనే చెప్పేయడం ద్వారా గాసిప్స్ ను అరికట్టవచ్చని నానీ నమ్ముతున్నాడంట. అందుకే సినిమా విడుదలను, గాసిప్స్ గురించి నానీ రియాక్ట్ అవుతున్నట్లు గుసగుస