దాచేపల్లి ఘటనపై సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటు : రోజా

Update: 2018-05-05 09:57 GMT

దాచేపల్లి ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు... వైసీపీ ఎమ్మెల్యే రోజా. 55 ఏళ్ళ అత్యాచార నిందిుతుడిని పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. అలాంటి పోలీసు శాఖ 

ప్రజలకేమి రక్షణ కల్పిస్తుందని రోజా ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్లే రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయన్న రోజా.. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసే ఇందుకు ఉదాహరణ అన్నారు. పైగా 
ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యంపై దాడి కేసును సీఎం చంద్రబాబే స్వయంగా సెటిల్మెంట్ చేశారని విమర్శించారు.

Similar News