వర్మ పైత్యం పరాకాష్టకు చేరింది. తన వైవిద్యమైన క్యారక్టర్ తో ఇబ్బందులు పడుతున్న ఆర్జీవీ తాజాగా సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆర్జీవీకి పలు ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు తిక్క-తిక్కగా సమాధానం ఇచ్చిన వర్మ ఎట్టకేలకు మూడు గంటల విచారణలో అనేక విషయాల్ని వెల్లడించారు.
పోలీసుల విచారణ ఎలా జరుగుతుందో మనకు తెలిసిందే. ఆ విచారణ బట్జి సదరు అదుపులో తీసుకున్న వ్యక్తికి ఏ శిక్ష విధించాలి. ఆ వ్యక్తి నిజం చెబుతున్నా..? లేదా అబద్ధం చెబతున్నాడా అనే విషయాల్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు తదిపరి దర్యాప్తుకోసం నిర్ణయం తీసుకుంటారు. అలా జీఎస్టీ కేసు కు సంబంధించి శనివారం హైదరాబాద్ సిసిఎస్ పోలిసుల ఎదుట హాజరైన వర్మ విచారణ ముగిశాక మరో వివాదానికి తెర తీశాడు.
పోలిసుల ఎదుట బాగా నటించానని, తనకు నటుడిగా...దర్శకుడు ఎవరైనా అవకాశం ఇవ్వండి అని వర్మ చేసిన ట్విట్ అనేక అనుమానాలకు దారితీస్తుంది. వర్మ ట్విట్ లో మర్మాన్ని చూస్తే , అతను పోలిసులకు చెప్పిన వివరాలన్నీ అబద్దాలేనా అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటె, వర్మ చేసిన ట్విట్ పై స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్....'మీకోసం స్క్రిప్ట్ సిద్దంగా ఉన్నదని, డేట్స్ ఇవ్వడమే ఆలస్యం' అని ట్విట్ చేశాడు. ఇవన్నీ ఇప్పుడు వర్మను మరోసారి వార్తల్లో నిలిచేలా చేశాయి. మరి ఈ కేసు విచారణ కాకుండా ఈ తరహా ట్వీట్ చేయడం మరింత వివాదానికి తెరతీసింది. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేసిన పోలీసులు మరోసారి ఆర్జీవీని కేసు విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ఆర్జీవీ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది.